Sunday, August 21, 2011

"అనగనగనగా!"





"చేజారిన సంతోషపు ఆనవాళ్ళు వెదికేందుకు,
 వీలు ఇప్పుడు దొరికింది!
 బాధ్యతలు వదిలివేసి,
 వయసుని ఇక సగంచేసి,
 కరిగిన కాలంలో కలలా చేరే,
 వీలుందంటే మా జోరుకు మళ్ళీ ప్రాణం వస్తుంది!
 .
 .
 .
 అందాల వెంట పరుగులు,
 చుర చుర చూపుల పలకరింపులు,
 ఆటలు,స్నేహితులతో ఆటవిడుపులు,
 అమ్మాయిల పరిచయం కోసం పడే పాట్లు.
 పుస్తకాలకు సెలవిచ్చి,
 పుత్తడి బొమ్మల్ని చదువుతుంటే,
 ప్రతి పేజీ మిస్టరీనే!
    అంతులేని హిస్టరీనే!
 దిశా నిర్దేశం లేదు,
   లక్ష్యం అసలే లేదు.
 ఇప్పుడొక్కసారి ఆలోచిస్తే!
 ఆ చిలిపితనపు సవ్వడిని చేయాలన్నా చేయలేని ఒంటరితనం.
 ప్రతిరోజూ ఆవిరైపోయే అసహజత్వం.
 .
 . 
 .
 జీవితంలో అవి తిరిగి రాని రోజులు!
 అందుకే... ఎన్నటికీ మరపురాని మధుర స్మృతులు..."


1 comments:

Anonymous said...

Raghavendra Nuttaki: వావ్ ! డియర్ చైతు గతమేప్పుడూ గమ్యం చేరని భావనలే ! వాటిని వెతకడాని మనిషిగా
వెళ్ల లేము. మనసును పంపించి వెతకనూ వచ్చుగతకాలపు జ్ఞాపకాల మధురిమల ఝల్లులలో
తెలియాడనూ వచ్చు. బాగుంది .అభినం దనలు . శ్రేయోభిలాషి ...నూతక్కి.

Post a Comment