Thursday, August 11, 2011

"ఇదీ భారతదేశం!"


"ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
అంతులేని సంపదలకు నెలవు.
విభిన్న కళలకు తెలిసిన కొలువు.
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.


చుట్టూ కష్టాలెన్నో వున్నా!
చెరగని చిరునవ్వులు మా సొంతం.
పేదరికంలో వున్నాకానీ!
భారతీయుడనని తెలియని గర్వం.
శత్రువులే కష్టంలో వున్నా! 
చలించిపోయే కరుణ హృదయులం.  
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.


మనుషులలోనే దేవుని చూసే,
పసిహృదయం మా మనసుల సొంతం!
కష్టకాలమే ఎదురవగానే,
ఫిరంగులై ఎదురెల్లి నిలుస్తాం!
ఆ.. స్థితిలోకూడా ప్రేమను పంచితే,
విషాన్ని తింటూ,
పాలను ఇచ్చే గంగిగోవులీ భారతీయులు!


ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
మసీదు పక్కన నివసిస్తాను,
రహీము తో స్నేహం చేస్తాను!
చర్చి గంటలకు కన్నులుతెరచి,
నే కొలిచిన స్వామిని పూజిస్తాను!
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.  "



4 comments:

Anonymous said...

Sri Krishna Chaithanya: last para. chala bagundandi..

Anonymous said...

Sudha Rani: చైతన్యగారు, చాలా బావుంది.
మనుషులలోనే దేవుని చూసే,
పసిహృదయం మా మనసుల సొంతం!
కష్టకాలమే ఎదురవగానే,
ఫిరంగులై ఎదురెల్లి నిలుస్తాం!
ఆ.. స్థితిలోకూడా ప్రేమను పంచితే,
విషాన్ని తింటూ,
పాలను ఇచ్చే గంగిగోవులీ భారతీయులు! ఇక్కడ కొద్దిగా మార్చాలేమో...ఎదురెల్లి అనికాక ఎదురెళ్ళి అని, ఇంకా మేము అని చెప్తున్నారు కనుక గంగిగోవులం, భారతీయులం అంటే బావుంటుంది...కానీ విషాన్ని తింటూ పాలను ఇచ్చే అనేది గోమాతకు సరిపోయే పోలిక కాదు కదా...అది కూడా ఓసారి ఆలోచించండి. అవును ..ఇది పాటగా పాడుకోవడానికి వీలుగానే ఉన్నట్టుంది...

Chaithanya said...

thanks for u r suggetions andi

Unknown said...

chala bagundi

Post a Comment