Thursday, August 4, 2011

"Feelings of my Heart"



"నువ్వంటే నాకు కోపం!
 నీవు లేకుండా నేను బ్రతకలేనేమోనని. 
 నేనంటే నాకిష్టం నిన్ను నేను ఇంతగా ఇష్టపడుతున్నానని...


 నువ్వంటే నాకు కోపం!
 ప్రతిక్షణం నీవు నాతో ఉండవని.
 నేనంటే నాకిష్టం నీవు లేని క్షణాలని కూడా నీ ఊహల్లో గడిపేస్తానని...


 నువ్వంటే నాకు కోపం!
 ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తావని.
 నేననంటే నాకిష్టం నీ మనసంతా నేనేవున్నానని...


 నువ్వంటే నాకు కోపం!
 నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చావని.
 నేనంటే నాకిష్టం నిన్నే నా భాగస్వామిగా పొందానని.   


 నువ్వంటే నాకు కోపం!
 నీవు నన్ను ప్రేమించలేదని.
 నేనంటే నాకిష్టం పియురాలివి కాకున్నా ఇల్లాలినిచేసానని.

 చివరికి నువ్వంటే నాకిష్టం!  
 నీవల్లే నన్ను నేను ఇష్టపడుతున్నానని..."

3 comments:

Anonymous said...

Sri Krishna Chaithanya : chala bagundi...

Anonymous said...

Tri H Sree: mitrama yemi chypparu

Anonymous said...

Chandra Sekhar: నీ కవితలు అద్భుతం, హృదయానికి హాయిని కలిగిస్తున్నాయి.

@ మాడుగుల చంద్రశేఖర్ శర్మ @

Post a Comment