Tuesday, May 8, 2012

లెక్కలన్నీ పూర్తయ్యాయా..!


విడిపోయేందుకు సిద్దపడ్డావ్!
నీ చూపుల కిరణాలు తాకి,
చివురించిన మది పుష్పం!
వాడిపోతే నీకేంటని,
తిరిగి రాని కాలంలా!
నన్ను దాటి వెళుతున్నావ్...

ఆశ నిరాశల మధ్యన,
జ్ఞాపకాల రాశులలో!
నిన్ను వెతకమని చెప్పి,
నన్ను ఒంటరిని చేసి...
అమావాశ్య వెన్నెలవై,
ఏ కలువను మురిపిస్తావో??

సమీపించిన సమీరమా...
అలరిస్తావని ఆహ్వానిస్తే,
వడగాలివై నను కావలించుకొని!
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే,
రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకవై...
నువు విడిచిన గొంగలిని నాపై కప్పి..
బాధించే జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చెళ్ళావా!!!
 

10 comments:

మెర్సీ మార్గరెట్ said...

రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకవై...
నువు విడిచిన గొంగలిని నాపై కప్పి..
బాధించే జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చెళ్ళావా!!!..
superb annaa..... touched my heart again ..

Anuradha said...

బాధించే జ్ఞాపకాన్ని బహుమతి గా ఇవ్వడమా ? వాట్ ఎ పిటీ! .. చాలా బావుంది కవిత.

Anonymous said...

Madhavi Annapragada : Touching.....

Anonymous said...

సాయి కామేష్ : ♡ly

Anonymous said...

Mehdi Ali : కొన్ని సాయంసంధ్యల్లో
కొంత ఎడబాటును ప్రేమిస్తూ
ఒక నిర్జీవ స్థితికి కావ్యరూపమిచ్చి
కొన్ని వాడిపోయిన మొములపై
పన్నీరు చిలుకరించి
వికసింపజేస్తావు ...excellent

Anonymous said...

Srikanth Kantekar : good

Anonymous said...

Sravana Saineni : Superb

Anonymous said...

Narayana Sharma Mallavajjala : tirigi raani kaalamlaa nanu daati velutunnav/ amaavasya vennelavai e kaluvanu muripistaavo/....vaakyaalaku balaanniche prteekaatmakata...[tagore 'naiveadyam' gurtostundi] baagundi

Anonymous said...

Chand Usman : రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకవై...
నువ్వు విడిచిన గొంగలిని నాపై కప్పి..well expressed anna

Anonymous said...

Sri Modugu : లెక్కలన్నీ పూర్తయ్యాయా...పూర్తీ అయ్యే ధ్యాసే కనిపించడం లేదే ....nice lines andi

Post a Comment