Tuesday, January 29, 2013

Save as


ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

నీది కాని నీ తనువుని చూస్తూ,
తడబడి పోతూ,
తమకపు కన్నులు చప్పుడు చేస్తూ..
తప్పులుచేస్తూ తిప్పలుపడుతూ..
క్రొద్దిసేపేమో కన్నీరంటావ్,
క్రొద్దిసేపేమో పన్నీరంటావ్,
కన్నీటిలోన పన్నీరు కలిపి
తప్పక ముందుకు సాగిపోతున్న,
తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!
బ్రతుకు బండిపై ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...
తప్పులు చేస్తూ ముందుకు సాగే,
వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!

15 comments:

Unknown said...

చాలా మంచి ఎక్స్ప్రెషన్

Anonymous said...

Renuka Ayola : సమాజానికో అద్దం ఇచ్చి,
క్షణక్షణానికి రంగులు మార్చి,
ముందున్నప్పుడు వెనుకకు చూపి,
వెనకున్నప్పుడు ముందుకు చూపి,
ముందు వెనుకలకు మధ్యన పెట్టి,
తడికలు చుట్టి గంతలు కట్టి,
నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
/ ఇలాంటి సమాజంలొ మనం/తడికలు గంతలు కట్టినా బతుకుని ఈడుస్తున్నాము/ చాలాబాగుంది

Anonymous said...

Chand Usman true lines...bayya

Anonymous said...

Masarapu Ramya : Wow..chala chaggaga jevitha satyanni chepparu chythanya...

Anonymous said...

Chandrasekhar Vemulapally తడికలు చుట్టి గంతలు కట్టి, నమ్మించేందుకు నటనలు నేర్చిన, మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ...ముందుకు సాగే, వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!
ఆవేదన అర్ధవంతంగా ....

Anonymous said...

Chandra Shekhar Vemulapally : మనసుకు నవ్వుల ముసుగు వేసుకొని,
బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!
బాగుంది కవిత. అభినందనలు చైతన్యా!

Anonymous said...

Jithender Bathula : బ్రతుకులీడ్చుకొని పరుగులందుకొని,
పడుతూ లేస్తూ పల్లికిలిస్తూ...
నన్నే చూస్తూ నిన్నే తిడుతూ,
నీకూ-నాకూ గొడవలు పెడుతూ,
కడుపులు కొడుతూ,
కలుపుని తింటూ...nice Anna......

Anonymous said...

Kavi Yakoob : ఇంకెన్నాళ్ళు???
అంతః ప్రవాహ అంతిమ చిత్రం!
ఉదయ-చంద్రికల మధ్యన సాగుతు,
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది! // అంతరంగ మధనం !

Chaithanya said...

నిజమే Kavi Yakoob గారు ఆ మథనం లోంచి ఒక్కోసారి అమృతం ఒక్కో సారి విషమూ వస్తుంది. అలా వచ్చిన ప్రతిసారీ బలవంతంగా త్రాగిస్తుంది నాది కాని నా తనువు చేత!

Chaithanya said...

మీ అన్వేషి : chythenya chaalaa baagundi...mee kavita...

Anonymous said...

Sarojini Devi : Bulusu bavundi

Anonymous said...

Subhash Koti : వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!
నీది కాని నీ తనువుని మోస్తూ,
ముందుకు సాగే...
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!................................ మనిషిలో వున్న హిపోక్రసీని మరియు పరాయీకరణను బాగా ఎత్తి చూపారండి.

Anonymous said...

Naresh Kumar : Superb sir...! Sri sri ni gurthuku teche shaili to nachindi..

Anonymous said...

Meraj Fathima : నమ్మించేందుకు నటనలు నేర్చిన,
మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!
నాది కాని నా తనువుని మోస్తూ..
ముందుకు సాగే,
వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!......ఎంత బాగుందొ ఈ భావం.

Chaithanya said...

నూరేళ్ళ జీవితం లో నేను ఏంటి అనే ప్రశ్నకు...కేవలం ఒక్కో పదం లో తేల్చేయాలి అనే ఆలోచనలోనుంచి వచ్సినవివి.............................................................................................వంచన బ్రతుకిది! ఒంటరి బ్రతుకిది!,మోసపు బ్రతుకిది! మోహపు బ్రతుకిది!,తప్పుడు బ్రతుకిది! తక్కెడ బ్రతుకిది!,వేషపు బ్రతుకిది! వ్యర్థపు బ్రతుకిది!... థాంక్స్ మీర్జా ఫాతిమా గారు.

Post a Comment