Tuesday, May 7, 2013

నువ్వింకా మారలేదు!!!


నేను ఎవరిని?
కులం గంజాయి మొక్కని చెప్తూ..
తులసి కోటలో పెట్టి పూజించే అబద్దానివి!!!!!

ఆమెవరు?
కుల మతాల గుప్పెట్లో..
ఇంకా బందీగా ఉన్న స్వేచ్చాపావురం!!!

వీరంతా ఎవరు?
ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి...
ఓదాన్లో కులం! ఓ దాన్లో మతం నింపిన
కావడినందించేందుకొచ్చిన తెలివైన వారు!!!

అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!

చివరిగా...
ఇంతకీ నీవసెంత?
మీరంతా నన్ను పిచ్చోడ్ని చేసి..
ఇప్పటి కి సరిగ్గా మూడేళ్ళు!!!!!!
 
 

11 comments:

Anonymous said...

Chand Usman : అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!...wah

మీరంతా నన్ను పిచ్చోడ్ని చేసి..
ఇప్పటి కి సరిగ్గా మూడేళ్ళు!!!!!!.....aha ha.. good one anna

Anonymous said...

Nvmvarma Kalidindi: అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!

Anonymous said...

కాశి రాజు : చైతన్య నువ్వింకా మారలేదు

Anonymous said...

Venkateswara Rao Madipalli : చైతన్యం
మార్పు తెస్తుంది
మారమని చెప్తుంది
ప్రశ్నిస్తుంది

చైతన్యా

నీవు మారావు
మారబట్టే
మారమని అడుగుతున్నావ్
ఎందుకు మారవని ప్రశ్నిస్తున్నావ్

Anonymous said...

Ramesh Gaddamidi : అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి! ఆహా స్వచ్ఛమైన మాట నిప్పు లాంటి నిజం చాలా బాగుంది చైతన్య గారు

Anonymous said...

Vikram Karimi : superb sir. meedi chadivinche kavitha. chala bagundi

Anonymous said...

Srinivas Vasudev : చాలా భిన్నమైన కవిత చైతన్యా...చాలా పరిణతితోకూడిన కవిత్వం ఇది..కీప్ రైటింగ్ Chythenya Shenkar

Anonymous said...

Mohan Ravipati : nice one

Anonymous said...

Pusyami Sagar : అతని నవ్వెందుకు అంత స్వచ్చంగా ఉంది?
చనిపోయాడు కదా! ఇక ఎవరి కోసం నటించాలి!
superb....lage raho sir ..

Anonymous said...

Mehdi Ali : nice

Anonymous said...

సుధ కొనకళ్ళ : కుల మతాల గుప్పెట్లో..
ఇంకా బందీగా ఉన్న స్వేచ్చాపావురం!!!nice lines

Post a Comment