Showing posts with label To My Sweet Heart. Show all posts
Showing posts with label To My Sweet Heart. Show all posts

Thursday, August 18, 2011

వింటున్నావా.... నా మాట!


"ఎన్నో ప్రత్యేకతలు నీ అడుగుల సవ్వడిలో,
 మరెన్నో సందేహాలు నీ మౌనపు చూపులలో!
 చురచుర చూపుల మాటున,
 తెలియని కోపాలెన్నో!
 తీయని నవ్వుల మాటున,
 నా మనసెరిగిన మధురిమలెన్నో!
 నే చూసిన కోణంలో నీ అందం అపురూపం!
 నిదురించే వేళలలో మురిపించే అమాయకత్వం!
 కవిలా నిను చేరుకొని,
 కవితల్లే నిను శోధించనా!
 శ్వాసై నీలో చేరి,
 హృదయంలో కొలువుండనా!
 ఆకలిదప్పులనెరుగని మంత్రము నాపై వేస్తే,
 నిద్రలేని రాత్రులెన్నో నిటూరుస్తూ గడిపాను!
 అలక మానేవేళ అచ్చెరువొందే రూపం!
 చెంత చేరేవేళ పరిమళాల పన్నీటి వర్షం!
 జీవితమంతా నీవై నావెంటే నువ్వుంటే,
 నీది కాని మరోలోకం నాకెక్కడ వుంటుంది!"



Friday, August 5, 2011

"Waiting for You............"



"రావా.....ఆ....
 పగలే వెన్నెలవై రావా.....ఆ..
 చినుకై నను తడుపుతు రావా....ఆ..చెలి నా నిచ్చెలి!     ||రావా...||


 నిను చూడని నేను,
 వేధనలకు నెలవు.
 నీకేమని చెప్పను నా ఊహల సారం.
 నిన్నే చేరా ల ను కుం టూ సాగే ఈ పయనం.
 జన్మంతా సం తో షా ని కి వచ్చే కలల వనం....     ||రావా...||


 నను నేనే మరచే,
 నీ పిలుపే విన్నా.
 ఎన్ని అని నే వెదుకను ప్రేమకు సాక్షాలను.
 అందాల లోకం రా! రమ్మంటూ నిన్నేవిడి,
 నా చుట్టూ చేరి పెంచెనులే నా గుండెసడీ......      ||రావా...||"  

Thursday, August 4, 2011

"Feelings of my Heart"



"నువ్వంటే నాకు కోపం!
 నీవు లేకుండా నేను బ్రతకలేనేమోనని. 
 నేనంటే నాకిష్టం నిన్ను నేను ఇంతగా ఇష్టపడుతున్నానని...


 నువ్వంటే నాకు కోపం!
 ప్రతిక్షణం నీవు నాతో ఉండవని.
 నేనంటే నాకిష్టం నీవు లేని క్షణాలని కూడా నీ ఊహల్లో గడిపేస్తానని...


 నువ్వంటే నాకు కోపం!
 ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తావని.
 నేననంటే నాకిష్టం నీ మనసంతా నేనేవున్నానని...


 నువ్వంటే నాకు కోపం!
 నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చావని.
 నేనంటే నాకిష్టం నిన్నే నా భాగస్వామిగా పొందానని.   


 నువ్వంటే నాకు కోపం!
 నీవు నన్ను ప్రేమించలేదని.
 నేనంటే నాకిష్టం పియురాలివి కాకున్నా ఇల్లాలినిచేసానని.

 చివరికి నువ్వంటే నాకిష్టం!  
 నీవల్లే నన్ను నేను ఇష్టపడుతున్నానని..."

చెప్పరాదా?






"చెప్పరాదా? నీ గుండె బాధ,
 నేనున్నది నీకోసమే కదా?
 బయమేలా ఓ జవరాలా?
 నీవులేని గుండెలోన సవ్వడేలా?    ||చెప్పరాదా?||

 నీకోసం వేచానే చిరుదీపంలా!
 నిలువెల్లా కరిగానే మరి మైనంలా!
 గాయంలోనూ ఆశను రేపే,
 అందాల మరుమల్లికవే.
 ఎండను సైతం మంచుగ మార్చే,
 చల్లని చూపు నీదేలే చెలియా...   ||చెప్పరాదా?||

 నీనవ్వుని వరమల్లే నాకిస్తావా?  
 ప్రతినిత్యం పువ్వులతో పూజిస్తాను.
 నీ వెచ్చని లయ ఊపిరులే వింటేనే, 
 నా మది జుమ్మని సవ్వడులు చేసేను.
 దేనిని సైతం లెక్కచేయకని,
 చెప్పే అందం నీదేలే సఖియా...   ||చెప్పరాదా?|| "

Wednesday, August 3, 2011

"i misS yoU....."(ఏమాయ చేశావే...)


"ఆవేదన నిండిన మనసున,
 చిరునవ్వుల పువ్వులు విరియవు..
 నా ఊహలు నన్నేవీడెను,
 అవి మెల్లగ నిన్నెచేరెను...
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

 వెన్నెలనే చూడగాఇలా,
 నీ మోమె వెక్కిరించెను .
 పువ్వుల తడి నన్ను తాకినా,
 నీ తనువే గుర్తుకొచ్చెను.
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

 నీవు లేని రోజు రేయిలా,
 చీకటులే కమ్ముకున్నవి.
 నీవు లేని చందమామిలా,
 చిన్నబోయి తుర్రుమ్మన్నది.
 ఏమాయ చేశావిలానా....ఆ.
 నా గతిని మార్చేశావిలా........     ||ఆవేదన నిండిన||

Friday, July 29, 2011

"కనులలో...కొలువైన వెన్నెల!"


"మాటల కందని భావనలేవో......
 కలలై కలవర పెడుతుంటే.
 నిద్దుర వీడిన కనులలో నీవు....
 వెన్నెలవై కొలువునావు.


 ఆ వెన్నెల కాంతుల తీయని ఊహలు,
 మనసున చేసెను సవ్వడులు.
 ఎదసడి చప్పుడు తెలిసేలాగ,
 నా ఊపిరిలో కొలువైనావు.


 నీవేనా ఆశల కెరటం..
 నీవేనా సుందర స్వప్నం...
 నీకై వేచే నా మనసుని సరిగా ఏనాడైనా చూశావా?
 నీ చిరునవ్వుల సవ్వడులకు లొంగిన పరవశాన్ని గమనించావా?


 మాటల కందని భావనలేవో......
 కలలై కలవర పెడుతుంటే.
 నిద్దుర వీడిన కనులలో నీవు....
 వెన్నెలవై కొలువునావు."