Showing posts with label I Hate Politics. Show all posts
Showing posts with label I Hate Politics. Show all posts
Friday, August 26, 2011
ఆశల పల్లకిలో ఊరేగే,
మధ్యతరగతి మహారాజుల వైభవం!
మాటల గారడీ,
మోసాలతో బురిడీ,
అయినా మారదు ఓటును అమ్ముకునే,
ఓటు వ్యభిచారుల ఒరవడి.
ఇదీ నా దేశం తీరు!
అధికారం పసలేదు,
రాజకీయం విలువలేదు,
ధనదాహం తీరిపోదు,
కుటిలనీతి మారిపోదు
పెదవులపై ధరహాసం,
మనసు నిండా కల్మషం.
ఇదీ నా దేశం తీరు!
కళ్ళుండీ చూడలేని,
కసిలేని జనాలు,
బొంకంతా బయట పడినా,
సిగ్గుపడని నాయకులు.
విలువలకు అర్థం తెలియదు,
రాజ్యాంగం భావం పట్టదు,
అభ్యుదయం పై ఆసక్తే లేదు,
ఇదీ నా దేశం తీరు!
ప్రతి మనిషినీ కబలించిన కరుణలేని ధనదాహం!"
Sunday, August 14, 2011
సేవంటూ మీపైస్వారీ చేస్తూ,
చేవలేని మీ బ్రతుకు సాక్షిగా,
రంగుమార్చిన తెల్ల దొరలము...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.
స్వాతంత్ర్యాన్నే సాకుగ చూపి,
తరతరాలుగా ఏలుతువున్నాం!
డబ్బులు దోస్తాం ప్రాణం తీస్తాం,
అడిగినవారిపై నిందలు వేస్తాం...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.
మాపిల్లలకు రక్షణనిస్తాం,
వారేమడిగిన ముందుంచేస్తాం.
మీ డబ్బుతొ మేం కులాసగ బ్రతుకుతు,
మీకళ్ళల్లో కారంకొడుతాం..
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.
ఓటు ఓటుకూ వందలనిస్తాం,
ఙ్ఞానంపోయే మందుని పోస్తాం,
మీప్రాణాలను గాలికి వదలి,
మా కుక్కల కోసం లక్షలు పోస్తాం...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి.
ధరల బాధలు తట్టుకోలేక,
జీతాలను పెంచాలని అంటే,
పెంచుతూనె కోతలను పెడుతాం!
పనులు మాత్రమేం చేయకుండనే,
మా భత్యాలను అనుభవిస్తాము...
మీకో నీతి మాకో నీతి ఇదే కదా మా రాజనీతి. "
Thursday, July 28, 2011
"వచ్చింది వచ్చింది స్వాతంత్ర్యం,
నేడు ఊపిరాడని జీవశ్చవం. || 2 ||
నాడు తల్లి సంకెళ్ళను తెంచారు మన దేశభక్తులు,
నేడు ఆ తల్లినే మోస్తున్నారు మన భోక్తలు.
|| వచ్చింది వచ్చింది ||
రెక్కలాడితె గాని డొక్క నిండని ప్రజలు,
ఈ అవనిపై ప్రతినిత్యం కోటాను కోట్లు.
వరకట్న నికృష్ట మారణ హోమం,
మగువలకు ఈ కర్మభూమిపై మనుగడే శూన్యం.
|| వచ్చింది వచ్చింది ||
దుష్టరాజకీయము దుర్నీతి చేష్ట,
నలుదిశల రగిలే ఉగ్రవాద రావణకాష్ట.
|| వచ్చింది వచ్చింది ||
ఇదికాదు ఇదికాదు స్వాతంత్ర్యం,
సర్వజన సౌభాగ్యమే మన ఆశయం,
సమసమాజ స్థాపనే మన ధ్యేయం,
అందుకై పోరాడుదాం ప్రతినిత్యం.
వచ్చింది వచ్చింది స్వాతంత్ర్యం,
నేడు ఊపిరాడని జీవశ్చవం. "
Subscribe to:
Posts (Atom)




