Saturday, July 30, 2011

"ఓ కాకి కథ"



 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది.
 కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది.      
 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది. 





 ఒక ఊరిలో కాలేజి పైనా వుండేది,
 తెలివైన పోకిరి కాకి...
 ఆ కాలేజి మహత్యమేమో కాని!
 తెలివినంతా వంట పటించుకుంది....అరె        



 జీవితం ఎంత చిత్రమైనది..
 ఎక్కడొ వున్న అందాల కాకి,
 చదువుకుందామని కాలేజికి చేరింది..
 కాలేజి పైన పోకిరిని చూసి,
 "తొలిచూపులోనే నామనసు నీవై,
  పలికించినావు పదనిసల రాగం"..
 అంటూ పోకిరి కాకితొ ప్రేమలో పడింది.    





 చూపులకైతే అది పోకిరే కాని,
 అందాల కాకిని పువ్వల్లే చూసింది.
 అంతులేని ప్రేమని బహుమతి గా ఇచ్చింది.
 ఆ ప్రేమ చూసి అందాల కాకి,
 పోకిరి గుండెల్లో గువ్వల్లే ఒదిగింది...





 రోజులు క్షణాలమల్లే ఇట్టే గడచి,
 తీపి కబురును త్వరగానే తెచ్చింది.




 కాలం ఆగక పరుగులు తీసి....
 ఆ శుభగడియ రానే వచ్చింది.





 కీక్... కీక్.. మంటూ..
 లోకాన్ని చూస్తూ,
 3 బుజ్జి పిట్టలు కళ్ళను తెరిచాయి. 





 చూస్తుండగానే వారం గడిచింది,
 2 కాకులు కావ్.. కావ్వ్.. మంటూ,
 అమ్మా , నాన్నలను ముద్దుగ పిలిచాయి,
 గూటిలో మిగిలిన ఒక చిట్టి గువ్వ...
 కుహు.......... కుహు..... 
 మంటు కూని రాగాతీసింది.        




 పక్కనున్న నా కల్లను కప్పి,
 ఎవడితో యీ పాడుపని చెసావు?
 పాటలు నేర్చుకొనమని నిన్ను పంపితె,
 పాడు పని చేసి పాపాన్ని మోసావు!
 నిను ప్రేమించిన గుండెల్లో గునపాన్ని దింపావు.
 అనుకుంటూ ఈ అఙ్ఞాన కాకి,
 ఏడ్చుకుంటు అడవిని దాటేసి వెళ్ళింది. 




 ఎక్కడ? తప్పు జరిగిందో తెలియని,
 అందాల కాకి బావురుమంది..
 తన ప్రాణంసగము వెళ్ళిపొయిందన్న నిజము 
 తెలిసి చిట్టిగుండె బదలైపోయింది..
 బ  ద   లై  పో  యిం   ది.


 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది.
 కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది."










Friday, July 29, 2011

"అభిమానం....."




 "అభిమానానికి లేవే హద్దులు,
 ఆకలి దప్పుల మాటిక ఏల?
 గుండెల నిండా నిండిన ప్రేమకు,
 అమృతమైనా దిగదుపేకదా.........? "

"కనులలో...కొలువైన వెన్నెల!"


"మాటల కందని భావనలేవో......
 కలలై కలవర పెడుతుంటే.
 నిద్దుర వీడిన కనులలో నీవు....
 వెన్నెలవై కొలువునావు.


 ఆ వెన్నెల కాంతుల తీయని ఊహలు,
 మనసున చేసెను సవ్వడులు.
 ఎదసడి చప్పుడు తెలిసేలాగ,
 నా ఊపిరిలో కొలువైనావు.


 నీవేనా ఆశల కెరటం..
 నీవేనా సుందర స్వప్నం...
 నీకై వేచే నా మనసుని సరిగా ఏనాడైనా చూశావా?
 నీ చిరునవ్వుల సవ్వడులకు లొంగిన పరవశాన్ని గమనించావా?


 మాటల కందని భావనలేవో......
 కలలై కలవర పెడుతుంటే.
 నిద్దుర వీడిన కనులలో నీవు....
 వెన్నెలవై కొలువునావు."

Thursday, July 28, 2011

ఇది నిజమా! కలవరమా!



"ఇది నిజమా! కలవరమా!,
ఇది నిజమా! కలవరమా!...... ||2||
నీ కనుల మెరుపే ఇలా నా......,
మౌనాన్ని మరిపించినాది.
ఓ చిలిపి ఊహే నువై నా.....,
నీడల్లే నా వెంట వుంది.
నువ్వు నా వెంట రావా!
గుండె నాదాన్ని వినవా!
చెలియా! చిలిపిగా చూడకే......... || ఇది నిజమా! ||

పువ్వులాంటి నీ నవ్వు చూడనా!
వెన్నెలల్లే నీ చెంత చేరనా!
చంపెయకే నీ నవ్వు తోటి.......

గాలితెమ్మరల్లే నన్ను తాకవే!
ఊహ వీడి నిజమల్లె మారవే!
ఊరించకే ఊహల్ని రేపి.........

నువ్వు సంద్యా సమీరం,
వేణుగానా వినోదం.
చెలియా చకచక వెళ్ళకే...... || ఇది నిజమా!||

తుమ్మెదల్లె నీ పెదవి గిల్లనా!
గుండెలోన చేరి సేదతీరనా!
ఈ రోజుకై ఇన్నాళ్ళు వేచా......
లాలిపాటలాగ జోలపాడనా!
నిన్ను చేరి నా మనసునడగనా!
నను వీడకే ఏ జన్మకైనా....

నువ్వు మాయా మయూరం,
కలల కావ్యా సరాగం.
వరమై నన్నిలా అల్లుకో.......

ఇది నిజమా! కలవరమా!,
ఇది నిజమా! కలవరమా!...... "

నాలో నీవై ...........


‎"నాలో రేగే ఆలోచనలకు రూపం నీవై మురిపిస్తావు,
గుండెలలోని బాథను చెరిపే స్పూర్తిని మనసుకు ఇస్తావు,
కవితా నీకు ఇవే నా జోహార్లు................."






నా ...కవిత


"ఈ కవితల పూదోటలో నా కవితా ఓ పువై పరిమలాలు వెదజలే లా చేసి,
ఆ పరిమలాల పరవశాన్ని మీతో పన్చుకునేందు ఇదే నా వేధిక..............."



నీవు......


‎"విరజాజి పూల జడివాన నీవు...
మనసంతా కురిసే తొలిమంచు నీవు...
తనువనువు తడిమే చిరుగాలి నీవు...
కవి కలములోని ప్రతి పదము నీవు...
ఆశలు రేపే కోర్కెవు నీవు....
ఆయువు పెంచే జీవము నీవు...
నిజమనిపించే కొంటె కలవు నీవు...
కలకాలం నా నీడవై నను అనుసరించే నా తోడువు నీవు...
ఒక్క మాటలో చెప్పాలంటే అంతంలేని కవితవు నీవు......"



మనమవ్వలిలా....!


‎"అథరాల మథుర,
జడివాన సుడుల,
కలహాల మథుర,
స్నేహాల సుథల,
నిజమవ్వు కలలా,
ఎగిసే అలలా,
కరిగే ఊహలా,
నీవులా....,
నీరులా!
నేనులా...,
నవ్వులా !
మనలా.... మరళా,
మనమవ్వలిలా....!"


" స్వాతంత్ర్యం"


"వచ్చింది వచ్చింది స్వాతంత్ర్యం,
 నేడు ఊపిరాడని జీవశ్చవం.                          || 2 ||




 నాడు తల్లి సంకెళ్ళను తెంచారు మన దేశభక్తులు,
 నేడు ఆ తల్లినే మోస్తున్నారు మన భోక్తలు. 
                                                      || వచ్చింది వచ్చింది ||


 రెక్కలాడితె గాని డొక్క నిండని ప్రజలు,
 ఈ అవనిపై ప్రతినిత్యం కోటాను కోట్లు.
 వరకట్న నికృష్ట మారణ హోమం,
 మగువలకు ఈ కర్మభూమిపై మనుగడే శూన్యం. 
                                                       || వచ్చింది వచ్చింది ||


 దుష్టరాజకీయము దుర్నీతి చేష్ట,
 నలుదిశల రగిలే ఉగ్రవాద రావణకాష్ట. 
                                                   || వచ్చింది వచ్చింది ||


 ఇదికాదు ఇదికాదు స్వాతంత్ర్యం,
 సర్వజన సౌభాగ్యమే మన ఆశయం,
 సమసమాజ స్థాపనే మన ధ్యేయం,
 అందుకై పోరాడుదాం ప్రతినిత్యం.


 వచ్చింది వచ్చింది స్వాతంత్ర్యం,
 నేడు ఊపిరాడని జీవశ్చవం. "