Saturday, July 30, 2011

"ఓ కాకి కథ"



 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది.
 కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది.      
 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది. 





 ఒక ఊరిలో కాలేజి పైనా వుండేది,
 తెలివైన పోకిరి కాకి...
 ఆ కాలేజి మహత్యమేమో కాని!
 తెలివినంతా వంట పటించుకుంది....అరె        



 జీవితం ఎంత చిత్రమైనది..
 ఎక్కడొ వున్న అందాల కాకి,
 చదువుకుందామని కాలేజికి చేరింది..
 కాలేజి పైన పోకిరిని చూసి,
 "తొలిచూపులోనే నామనసు నీవై,
  పలికించినావు పదనిసల రాగం"..
 అంటూ పోకిరి కాకితొ ప్రేమలో పడింది.    





 చూపులకైతే అది పోకిరే కాని,
 అందాల కాకిని పువ్వల్లే చూసింది.
 అంతులేని ప్రేమని బహుమతి గా ఇచ్చింది.
 ఆ ప్రేమ చూసి అందాల కాకి,
 పోకిరి గుండెల్లో గువ్వల్లే ఒదిగింది...





 రోజులు క్షణాలమల్లే ఇట్టే గడచి,
 తీపి కబురును త్వరగానే తెచ్చింది.




 కాలం ఆగక పరుగులు తీసి....
 ఆ శుభగడియ రానే వచ్చింది.





 కీక్... కీక్.. మంటూ..
 లోకాన్ని చూస్తూ,
 3 బుజ్జి పిట్టలు కళ్ళను తెరిచాయి. 





 చూస్తుండగానే వారం గడిచింది,
 2 కాకులు కావ్.. కావ్వ్.. మంటూ,
 అమ్మా , నాన్నలను ముద్దుగ పిలిచాయి,
 గూటిలో మిగిలిన ఒక చిట్టి గువ్వ...
 కుహు.......... కుహు..... 
 మంటు కూని రాగాతీసింది.        




 పక్కనున్న నా కల్లను కప్పి,
 ఎవడితో యీ పాడుపని చెసావు?
 పాటలు నేర్చుకొనమని నిన్ను పంపితె,
 పాడు పని చేసి పాపాన్ని మోసావు!
 నిను ప్రేమించిన గుండెల్లో గునపాన్ని దింపావు.
 అనుకుంటూ ఈ అఙ్ఞాన కాకి,
 ఏడ్చుకుంటు అడవిని దాటేసి వెళ్ళింది. 




 ఎక్కడ? తప్పు జరిగిందో తెలియని,
 అందాల కాకి బావురుమంది..
 తన ప్రాణంసగము వెళ్ళిపొయిందన్న నిజము 
 తెలిసి చిట్టిగుండె బదలైపోయింది..
 బ  ద   లై  పో  యిం   ది.


 అంతులేని అడవి వుంది,
 అందులోనె కాకి కూడా వుంది.
 కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది."










4 comments:

Anonymous said...

Suresh Kumar: బహుసా... ఆ కాకికి లోకులనే కాకుల మీద నమ్మకమెక్కువనుకుంటా....ఏకా​కిగా అడవినొదలిపోయింది...

కనకాంబరం said...

presentation n concept is wonderful .bless you dear. Do wonders. ...NUTAKKI.(kanakambaram.)

Anonymous said...

Raghavendra Nuttaki: ఫోటోలు చాలా బాగున్నాయి. మీ presentation కూడ బాగుంది. అభినందనలు .proceed
Dear.

Chaithanya said...

ThankX a loT siR...... Thank You Very Much...

Post a Comment