Wednesday, May 15, 2013

ఎందుకు రాములా???

1
ఎప్పట్లానే....
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కాడు రాములు!!!
మొదలెట్టిన చోటికే
తిరిగొస్తానని తెలిసీ 
నిన్నటికి దూరంగా
వెళ్ళాలనే ప్రయత్నంలో
ఐస్బండిని నెట్టుకెళ్తూ

2
రోజూ చేసే పనే అయినా
విసుగు రాదెందుకో...
విసుగురాదని మనమనుకోవటమేనేమో!
వచ్చినా దాన్ని రాములు
ఏరాత్రికారాత్రి
తన ఆత్మస్థైర్యపు వెలుగుకి
ఆవలున్న చీకట్లోకి విసిరేసి
తెలవారగానే
మళ్ళీ ఎప్పట్లానే
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కేస్తాడు రాములు!!!

3
ఏంది రాములా!!!
ఇంకెన్నేళ్ళు నెట్టుకొస్తావు
ఈ ఐస్బండిని
అన్న వారందరికీ
"నేను నెట్టుకొచ్చేది
ఇస్బండిని కాదు! నా కుటుంబాన్ని"
అన్న సమాధానం చెప్పికానీ,
ఆ కుటుంబాన్ని! కాదు కాదు
ఆ ఇస్బండిని నెట్టుకు పోడు...

4
కొందరి కళ్ళకి ఆ రోడెందుకో
నీరసంగా ఉంది కొన్ని రోజులుగా
రాములు పాదాల ముద్దుల్లేక!!!
అంతగా దగ్గరయ్యాడు చాలామందికి రాములు...

5
ఏమైఉంటుందోనని చూసేందుకు
రాములు ఇంటికి వెళ్లిన వారందనినీ
ఓ దృశ్యం మాత్రం కలచివేసిందాయింటి ముందు...!
అక్కడిప్పుడు
ఐస్‌ఫ్రూట్ తినటం పూర్తయ్యాక
విసిరి పరేసిన పుల్లలా
రాములు లేని ఐస్బండి!!!!!

7 comments:

Anonymous said...

Varnalekha Varu : O dhayaniya gadha.... baga cheparu Chythenya Shenkar

Anonymous said...

Anu Radha : baavundi chythenya.. manasuku hatthukunela undi description..

Anonymous said...

Prakash Mallavolu :
"నేను నెట్టుకొచ్చేది
ఇస్బండిని కాదు! నా కుటుంబాన్ని"...

చాలా చాలా బాగుంది...

Anonymous said...

Padma Sreeram :
"రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కాడు రాములు!!!"

భలే ఉంది చైతన్యా మీ పద ప్రయోగం.చివర్లో మీరు తిప్పిన మలుపు గుండెను మెలిపెడుతున్నా....అందంగా ఉంది...

Anonymous said...

Suresh Vanguri : excellent.

Anonymous said...

R Damayanthi R Damayanthi : అక్కడిప్పుడు
ఐస్‌ఫ్రూట్ తినటం పూర్తయ్యాక
విసిరి పరేసిన పుల్లలా
రాములు లేని ఐస్బండి!!!!!
baavumdi. abhinandanalu.

Anonymous said...

Kavi Savyasaachi : తన ఆత్మస్థైర్యపు వెలుగుకి
ఆవలున్న చీకట్లోకి విసిరేసి
తెలవారగానే
మళ్ళీ ఎప్పట్లానే
రోజుని భుజానేస్కుని
రోడ్డెక్కేస్తాడు రాములు!!! Baagundi- savyasaachi hrudhilaya nundi

Post a Comment