Sunday, July 31, 2011

"ప్రేమలో పడ్డాను...."




"మాటలాడ నీవు లేక మనసంతా బరువైతే...,
 మదిలోని భావాలను చాటుగానె వుంచుకుంటే,
 చక్కని నీ చిరునగవు,
 చెరగని ఆ చిరునవ్వు,
 చెంతచేరి ఇంకా నను చదరుమదురు చేస్తుంటే...
 ఏమని చెప్పను? ఎలా చెప్పను?

 హృదయంలో అనునిత్యం వేచ్చని నీ పవనాలే,
 తాడలేక నీకొసం పరితపించి పోతుంటే,
 ఏమని చెప్పను? ఎలా చెప్పను?

 మెరుపల్లే కనిపిస్తూ,ప్రతి క్షణం మురిపిస్తూ..
 మువ్వవై నా మదిని తట్టి,మత్తువై నను నిద్రపుచ్చి,
 నీవు చేసే ఇంద్రజాలాన్ని గూర్చి,
 ఏమని చెప్పను? ఎలా చెప్పను?

 ఇలా,
 ప్రతిక్షణం ప్రతి నిముషం వెంటాడే భావనలే,
 ఆ భావాలే ఆవిరై మేఘాలుగ మారిపోని,
 నిను చేరిన వెనువెంటనే చినుకులుగా రాలిపోని,
 ఆ..చినుకులలో ఇమిడివున్న భావాన్ని చదివి చూడు,
 నీకోసం పరితపించు హృదయాన్ని తెరచిచూడు."    

                                           

5 comments:

Anonymous said...

Suresh Kumar: బాగుంది...మొత్తానికి పడ్డారన్నమాట....

Anonymous said...

Obul Reddy: excellent

Anonymous said...

N Srinivasa Reddy: మదిలో జరిగే సంఘర్షణను చక్కగా వివరించారు..!

Anonymous said...

Raghavendra Nuttaki: అద్భుతం యీ భావ విన్యాసం .పడ్డాడండి ప్రేమలో మరీ! అని పాడాలనిపించింది డియర్
.మీ బ్లాగ్ బాగుంది. రచనా .....బాగుంది....శ్రేయోభిలాషి ...నూతక్కి.

Anonymous said...

Venkataramana Gavireddi: mee kavithlu chala bagunnai

Post a Comment