Tuesday, August 23, 2011
"అదిగో ఆకాశాన అందాల తార!
ఇదిగో నా ప్రక్కన ఆ వెలుగు జాడ!
కన్నుల్లో వెన్నెలలు,
నవ్వుల్లో సరిగమలు,
నువు చూసే చూపుల్లో,
మది మీటే భావాలు... ||అదిగో ఆకాశాన||
తప్పస్సులెన్నన్ని చేసానో!
యీ జన్మలో నిను చూసాను!
మామూలు అమ్మాయి లానేనువ్వున్నా!
ఆ నవ్వులో ఎదో గమ్మత్తు వుంది!
యీ క్షణాలు ఇలానే,
ఉండే వీలే లేదా...ఆ..? ||అదిగో ఆకాశాన||
కూర్చున్న చోటే శిలనైన!,
ఏ మంత్రమేసావె చినదానా!
ఇవ్వాళ నా గుండె గువ్వల్లె మారి,
నా మాట విననంటు మారాము చేసి,
నీ మనసే తన తోడంటూ,
ఇక ననే వీడెనుగా...ఆ.. ||అదిగో ఆకాశాన||"
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నా పేరు శంకర్: మనసుకు తెలియదు వయసు..!
ఈ కవిత చదివితే తెలియును నీ మనసు..!
Syamala Nyabilli: Chaithanya nenu mee blog chusaanu, chaalaa baagundi friend
Post a Comment