Monday, August 8, 2011

"కొంచెం ఇష్టంగా...""
 అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
 ఆమె  : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
 అతడు : నీ స్పర్శే  నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
 ఆమె  : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
 అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
         వికసించనీ యీ జన్మకి.              ||చందమామనే||


 అతడు : చెప్పలేను నా ఊహల్లో నీ.. కౌగిలింత మోహం!
         పొమ్మనంటు నన్ను చంపుతుంది కమ్ముకున్న తాపం.
 ఆమె : చూపుతోనే నన్ను ఖైధు చేసే నీ.. ప్రయత్నం!
       తేనెటీగలాగ దోచుకుంధి నా సమస్థం.
 ఇద్దరు: గడిపేద్దాం ప్రతిక్షణాన్ని,
        మన ప్రేమను కలిపి ఓ రంగులలోకంలో...   ||చందమామనే||


 అతడు : పాలనురగలు నీ పెదవులపై నాట్యమాడుతుంటే...
        పంచదార నా పంటితోటి అందించనా?
 ఆమె : చాలు చాలు నీ ఆగడాలు ఆపు!ఇకచాలు,
        వద్దు వద్దనంటు వేడుకుంది సిగ్గుపడ్డ తనువు.
 ఇద్దరు : విహరిద్దాం ఆకాశాన,
        రెక్కల్నే చేర్చుకొని వెన్నెల వెలుగుల్లో.......


 అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
 ఆమె  : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
 అతడు : నీ స్పర్శే  నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
 ఆమె  : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
 అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
         వికసించనీ యీ జన్మకి............."      


13 comments:

Anonymous said...

Chakravarthula Kiran: బాగుంది, తమ్ముడూ! టంకదోషాలు (typographic errors) లేకుండా చూసుకో.

అలాగే... మఱి కొంత నిర్మాణాత్మక ప్రతిస్పందన:

* "ముందుకు నడిపే సంజీవని" - సంజీవని మళ్ళీ బ్రతికిస్తుందే కానీ "ముందుకు నడిపేది" కాదుగా.
* "తేనెటీగలా దోచుకుంది నా సమస్తం" - ఇందులో దోచుకున్నది యేమిటి అన్నది "అర్థమవుతూనే ఉందిగా!" అనిపించినా అవ్యక్తంగా ఉండటం ప్రశ్నను రేకెత్తిస్తుంది.
* "పాల నురగలు" ఎందుకు ఆడుతున్నాయి ఆమె పెదవుల పైన? (శోభనం సందర్భంగా వచ్చే పాట అనుకున్నా... పాల నురగ కాదు కదా పెదవి పైన ఉండేది.)

I hope you take the feedback positively. గురువుగారు సీతారామశాస్త్రి గారు నాకు గతంలో చెప్పిన ఒక మాట యిక్కడ ప్రస్తావిస్తాను: "నీ పాటలు కొద్దో గొప్పో బాగున్నాయి కనుకనే విమర్శించటానికి పూనుకున్నాను. అసలు బాలేకపోతే నేను వీటి మీద నా సమయం వృథా చేయటమెందుకు? 'బాగుంది, ఇలాగే వ్రాస్తూ ఉండు' అని చెప్పి ఊరుకుంటే నాకూ హాయి కదా!"

చైతన్య said...

Thanks bhayya...... 1.Sanjeevani brathikinchedey.... ayithe aame thaakina prathisaari thanlo jeevam nimpi thana premanu+santhoshaani re-charge chesi mundhuku naduputhundhi ane vudhesam tho alaa raasanu...... 2.Ikkada thanu maanenu kevalam choopulathote thanaloni maadhuyannantha theneteegalu poolaloni thenenu dongilinchinatlu naa maadhuryanni dongilisthunaavu anna vudhesay to raasanu.. 3.Adi first night kaadhu bhayya athanu aameku oka chilipi prashna sandhinchaadu.... nee pedhavipai paalanuragalu natyamaade sandharbham vasthey nenu ilaa cheyanaa ani aduthunaaadu..... aa maatalaki aame samaadhaanam chepthundhi bayya..

Anonymous said...

Chakravarthula Kiran: nee samaadhaanaalu samtRptikaramgaa lEvanE cheppaali... but since this is only about one song, let's leave it here. :)

Anonymous said...

N Srinivasa Reddy: baavundandi..!

చైతన్య said...

1.నీ స్పర్శే నను ముందుకు నడిపే అంతఃశక్తని అని తెలిపింది.
2.ఆపనంది నా తనువుతోటి సాగించే యుద్ధం.
అని మార్చుతున్నా....bhayya
ఇక 3వ ది అతను అలాంటి సందర్భంలో ఇలా చేస్తా అని చెబుతున్నాడు.. so oka vela idhi kuda marchamante marchutha....
a few seconds ago · Like

Anonymous said...

Chakravarthula Kiran: ‎Chaithanya: మార్పులు చేయబూనటం మంచి పద్ధతి, మెచ్చుకోదగినది కూడా. ఱేపు సినిమాలకి వ్రాసే ఉద్దేశము, అవకాశము, అవసరము కలిగినప్పుడు చాలా సార్లు ఎదుఱయ్యే పరిస్థితే యిది. దానికి సంసిద్ధత అలవడుతుంది యీ అభ్యాసంలో.

సినిమాలకి వ్రాసినా, లేకున్నా... నా కోసం కాదు, తమ్ముడూ... *నీ* పాట బాగుండటం కోసం మార్చుకోవచ్చు. :)

* "అంతఃశక్తని తెలిపింది" అన్నది నువ్వెంచుకున్న తాళానికి సరిపోతుంది. కనుక యీ మార్పు సముచితమే.

* నువ్వు చెయ్యబోయే మార్పు పై పంక్తికి పొడిగింత. కనుక దానికి సహజంగా అతికేలా ఉండేటట్టు చూసుకో. "చూపుతోనే ఖైదు చేసే ప్రయత్నం..." ఏం చేస్తోంది? - ఇది నువ్వు మార్చవలసిన పంక్తిభాగం.

* అలాంటి సందర్భం వస్తే... అన్న దానికి తర్కమేంటి? అంటే అక్కడ "నువ్వు స్కూటర్ నడుపుతుంటే నీ బుఱ్ఱ బద్దలు కాకుండా హెల్మెట్ పెట్టుకో" అని కూడా వ్రాయచ్చు. కానీ దానికి తగిన సందర్భము, భూమిక, ప్రాతిపదిక ఉండాలి కదా. ఇది కూడా శిల్పానికి సంబంధించిన విషయమే.

చైతన్య said...

చూపుతోనే నన్ను ఖైధు చేసే నీ.. ప్రయత్నం!
ఆపనంది నా తనువుతోటి సాగించే యుద్ధం.... dhanini ilaa correct chesanu..

Anonymous said...

Chakravarthula Kiran ‎^ అతని ప్రయత్నమేం చేసిందో అతనికే చెప్పటం సమంజసమా? :) "తనతో ఏం చెబుతోందో" చెప్పవచ్చు... కానీ అంత కన్నా మెఱుగుగానే ప్రయత్నించవచ్చేమో?

చైతన్య said...

yee chinna maarpu meeru cheyadhi naakoo betterment elaa cheyocho telusthundhi .... bhayya

Anonymous said...

Chakravarthula Kiran: సరే... "కాదనలేను, అవుననలేను... ఏం విచిత్రం!" అంటే?

చైతన్య said...

anakkarledhu anthe..........bayya

చైతన్య said...

thanks for u r suggetions..

Anonymous said...

Chakravarthula Kiran: Welcome, bro! :)

Post a Comment