Saturday, August 13, 2011
"రాఖీ కట్టిన ఈ చేతితోనే,
చిట్టి తల్లికి గోరుముద్దలు తినిపించాను.
డబ్బుకన్నా విలువైన ఆత్మీయతను,
నీకు లాలనగా ఇచ్చాను.
అందుకనే చెబుతున్నా.....
నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!
అమ్మలోని ప్రేమను చూసావు!
నాన్నలోని నమ్మకాన్నీ చూసవు!
ఆరెండూ కలిసిన అన్నలోని అనురాగాన్నీ పొందావు.
అందుకనే చెబుతున్నా.....
నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!
నీకు ఎన్ని ఏళ్ళు రానీ,
నువు నా బుజ్జి తల్లివే..
ఎంత ఎదిగినకాని,
ముద్దుమాటలతోటి నను
బురిడీ కొట్టించిన నా చిన్నారి చెల్లివే.
అందుకనే చెబుతున్నా.....
నేను నీ అన్నను అందుకే నువ్వేది అడిగినా కాదు! అనను!"
Thursday, August 11, 2011
"ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
అంతులేని సంపదలకు నెలవు.
విభిన్న కళలకు తెలిసిన కొలువు.
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
చుట్టూ కష్టాలెన్నో వున్నా!
చెరగని చిరునవ్వులు మా సొంతం.
పేదరికంలో వున్నాకానీ!
భారతీయుడనని తెలియని గర్వం.
శత్రువులే కష్టంలో వున్నా!
చలించిపోయే కరుణ హృదయులం.
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
మనుషులలోనే దేవుని చూసే,
పసిహృదయం మా మనసుల సొంతం!
కష్టకాలమే ఎదురవగానే,
ఫిరంగులై ఎదురెల్లి నిలుస్తాం!
ఆ.. స్థితిలోకూడా ప్రేమను పంచితే,
విషాన్ని తింటూ,
పాలను ఇచ్చే గంగిగోవులీ భారతీయులు!
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం.
మసీదు పక్కన నివసిస్తాను,
రహీము తో స్నేహం చేస్తాను!
చర్చి గంటలకు కన్నులుతెరచి,
నే కొలిచిన స్వామిని పూజిస్తాను!
ఇదీ భారతదేశం!
ఇదినా భారతదేశం. "
"ఆగని పోరాటానికి దక్కిన విజయం ఈ స్వాతంత్ర్యం.
భారతదేశపు అణచివేతలో పెల్లుబికినదే యీ స్వాతంత్ర్యం.
దేశ ప్రజల చిరునవ్వుల కోసం,
గాంధి చూపిన తెగువకు చెబుదాం......
సలాం సలాం.... .... మీకు సలాం సలాం!
మంచితనంపై అధికారంతో,
జనులను బానిసలుగ చేసి.
మా సంపదనే మీ సొత్తంటూ దేశాన్నే లూటీ చేసి,
సాగించిన అరాచకాలపై,
పొందిన విజయం యా స్వాతంత్ర్యం.
రక్తపుటేరులపై నడుస్తూ,
సాధించినదే యీ... స్వాతంత్ర్యం.
..............................
యీ పోరాటంలో అసువులుబాసిన ,
ప్రతిఒక్కరికీ చెబుదాం మనసున,
సలాం సలాం.......మీకు సలాం సలాం!
స్వాతంత్ర్యం నా జన్మహక్కనే లక్ష్యాలెన్నో చూసాము,
చావుకు కూడా రొమ్ములు విరిచిన ధీరశాలులను చూసాము,
ఇందరి ప్రాణాలర్పణ చేసి,
ఇచ్చినదేగా యీ స్వాతంత్ర్యం.
దేశంకోసం బెదరని పోరును,
సలపిన వీరులదీ.. స్వాతంత్ర్యం.
...................................
ఆ గుండెలనిండా దేశం స్వేచ్చను,
నింపుకున్న ప్రతిగుండెకు చెబుదాం.
సలాం సలాం..... మీకు సలాం సలాం!"
Wednesday, August 10, 2011
అతి తక్కువ సమయం లో నాకు ఆత్మీయునిగా మారి, మనందరి మధ్య నుండి తిరిగిరాని తీరాలకు వెడలిపోయిన నా మిత్రుడు సాయి మరణానికి ఇదే నా అశ్రునివాళి.............
"ఓ ఆత్మ నేడు,
తనకు ఇన్ని రోజులూ ఆశ్రయమిచ్చిన శరీరాన్ని వదలి,
ఈ విశ్వ రహస్యంలో అంతర్ధానమైపోయింది!
సృష్టి మూలాలను చేధించేందుకు,
తన ఆశను,తన నీడను ,
తన అర్ధాంగిని,తన రక్తాన్ని,
అనుంగులను,అన్నదమ్ములను,
అందరి చిరునవ్వులను చెమర్చుకుంటూ...
తనగుండె చప్పుళ్ళను ఆపి,శరీరన్ని వదలి,
సత్యాన్వేషి అయి ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
తెలవారాక ఆ పలకరింపులు లేవు!
మలుపు మాటున సడిచేసిన ఎరిగిన గొంతుక లేదు!
చిరునవ్వులు చిద్రమవుతూ,కనుల ముందే బూడిదవుతూ,
కన్నీటి వీడ్కోలులు అందుకొని,
తిరిగి రాని లోకాలకు ఇంత త్వరగా వెళుతున్నావా?
ఇన్నాళ్ళ నీ బాధను చెప్పుకునేందుకు,
నీ తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నావా?
సమాధానం చెప్పు మిత్రమా!!!!!!!!!!!!!!
ఆలశ్యమవ్వవచ్చుగాక @@@@@@
ఖచ్చితంగా నేనూ నినుచేరి... నీ చిరునవ్వులు చూస్తాను.
ఆ క్షణాన తిరిగి మనం మనసు విప్పి మాట్లాడుకుంద్దాం!!!"
Monday, August 8, 2011
"
అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
ఆమె : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
అతడు : నీ స్పర్శే నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
ఆమె : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
వికసించనీ యీ జన్మకి. ||చందమామనే||
అతడు : చెప్పలేను నా ఊహల్లో నీ.. కౌగిలింత మోహం!
పొమ్మనంటు నన్ను చంపుతుంది కమ్ముకున్న తాపం.
ఆమె : చూపుతోనే నన్ను ఖైధు చేసే నీ.. ప్రయత్నం!
తేనెటీగలాగ దోచుకుంధి నా సమస్థం.
ఇద్దరు: గడిపేద్దాం ప్రతిక్షణాన్ని,
మన ప్రేమను కలిపి ఓ రంగులలోకంలో... ||చందమామనే||
అతడు : పాలనురగలు నీ పెదవులపై నాట్యమాడుతుంటే...
పంచదార నా పంటితోటి అందించనా?
ఆమె : చాలు చాలు నీ ఆగడాలు ఆపు!ఇకచాలు,
వద్దు వద్దనంటు వేడుకుంది సిగ్గుపడ్డ తనువు.
ఇద్దరు : విహరిద్దాం ఆకాశాన,
రెక్కల్నే చేర్చుకొని వెన్నెల వెలుగుల్లో.......
అతడు : చందమామనే అందుకున్న నా మనసు నా మాట విననంది."
ఆమె : వేయి జన్మల వరము నీవనే నిజము నాకిలా తెలిపింది!
అతడు : నీ స్పర్శే నను ముందుకు నడిపే సంజీవిని అని తెలిపింది.
ఆమె : చెప్పకనే నను అల్లుకుపోయే చూపుల అర్ధం తెలిసింది!
అతడు : ఓ..హో నీ ప్రేమలో.. ఓ పువ్వునై
వికసించనీ యీ జన్మకి............."
Sunday, August 7, 2011
"గతాన్ని తలుచుకు కుమిలే నాకు,
రేపటి ఆశను చూపెను స్నేహం.
అడుగడుగున నా తోడుంటుంది,
ప్రతి ఆలోచనకూ ఊతమౌతుంది.
ఇంకా చెప్పాలంటే.....
చిరుదివ్వై నే ముందుకు సాగితే,
మైనం లా వెంటేవుంటావు.
చీకటులే నను తరుముతువుంటే,
కిరణంలా నాకెదురౌతావు.
అందుకే,
నా ఈ జీవితానికి యీ శోభనిచ్చింది నీ స్నేహం....
ఇక యెన్నేళ్ళయినా వన్నె తగ్గనిది మన స్నేహం......"
నేటి యీ స్నేహితుల దినోత్సవం కి నా మనసున దాగిన...
మాటలతో చెబుతున్నా శుభాకంక్షలు...."
"నువు నా ప్రాణం నేస్తం,
ఒకరికి ఒకరం సొంతం!
ఎవరేమన్నా కానీ,
ఒకటే ప్రాణం మనది.
నువు నా ప్రాణం నేస్తం,
ఒకరికి ఒకరం సొంతం!
నా జీవితానికి అర్థంలేదు,
నా పక్కనే నువ్వు లేకుంటే.
ఇంద్రధనుస్సు నాకు అక్కరలేదు,
నువ్వు నావెంట రాకుంటే.
చెప్పగలను నేకన్న ఊహను,
చీకటిలోను వెలుగు రేఖను. ||చెప్పగలను||
నువు నా ప్రాణం నేస్తం,
ఒకరికి ఒకరం సొంతం!
ఎవరేమన్నా కానీ,
ఒకటే ప్రాణం మనది.
చందమామలా కనిపించావు,
నిండు వెన్నెలను మనసున దాచి.
కంటిరెప్పవా తోడుంటావు,
చంటిపాపలా కాపాడేందుకు.
నా కంటిచూపుకే నే చెపుతాను,
నువ్వు వుండగా నే మోసపోనని. ||నా కంటిచూపు||
నువు నా ప్రాణం నేస్తం,
ఒకరికి ఒకరం సొంతం!
ఎవరేమన్నా కానీ,
ఒకటే ప్రాణం మనది."
Saturday, August 6, 2011
"వదలకు ఈ చేతిని నువు కలలోనైనా..
నా కన్నీటిని ఆపేశక్తి నీకు మాత్రమే ఉంది మిత్రమా!
వేధన మాటున దాగుంటావు,
వేల ఆశలను చూపిస్తావు.
నువ్వున్నావని తెలిసిన క్షణమే,
బాధలు నను విడి వెళ్ళిపోతాయి.
నీడల్లే నా వెంటేవున్నా ఆలివిమాత్రం కాదు నువ్వు,
నా ఆకలి మనసుని ఎరిగినకాని! అమ్మవు మాత్రం కాదు,
అన్నల్లే వెన్నంటేవున్నా రక్తబంధం మనకు లేదు,
...............................................
మరి నీవ్వెవ్వరివని? నా మనసుని అడిగితే
ఇవ్వన్నీ కలిసి వరమ్మల్లే నా చెంతకు చేరిన స్నేహితుడివని అది చెప్పింది"
నా కన్నీటికి అడ్డుగొడల్లే నిలిచిన నా స్నేహితులందరికీ .....
అంకితం.........
Friday, August 5, 2011
"రావా.....ఆ....
పగలే వెన్నెలవై రావా.....ఆ..
చినుకై నను తడుపుతు రావా....ఆ..చెలి నా నిచ్చెలి! ||రావా...||
నిను చూడని నేను,
వేధనలకు నెలవు.
నీకేమని చెప్పను నా ఊహల సారం.
నిన్నే చేరా ల ను కుం టూ సాగే ఈ పయనం.
జన్మంతా సం తో షా ని కి వచ్చే కలల వనం.... ||రావా...||
నను నేనే మరచే,
నీ పిలుపే విన్నా.
ఎన్ని అని నే వెదుకను ప్రేమకు సాక్షాలను.
అందాల లోకం రా! రమ్మంటూ నిన్నేవిడి,
నా చుట్టూ చేరి పెంచెనులే నా గుండెసడీ...... ||రావా...||"
Thursday, August 4, 2011
"నువ్వంటే నాకు కోపం!
నీవు లేకుండా నేను బ్రతకలేనేమోనని.
నేనంటే నాకిష్టం నిన్ను నేను ఇంతగా ఇష్టపడుతున్నానని...
నువ్వంటే నాకు కోపం!
ప్రతిక్షణం నీవు నాతో ఉండవని.
నేనంటే నాకిష్టం నీవు లేని క్షణాలని కూడా నీ ఊహల్లో గడిపేస్తానని...
నువ్వంటే నాకు కోపం!
ప్రతిక్షణం నా గురించే ఆలోచిస్తావని.
నేననంటే నాకిష్టం నీ మనసంతా నేనేవున్నానని...
నువ్వంటే నాకు కోపం!
నా జీవితంలోకి ఆలస్యంగా వచ్చావని.
నేనంటే నాకిష్టం నిన్నే నా భాగస్వామిగా పొందానని.
నువ్వంటే నాకు కోపం!
నీవు నన్ను ప్రేమించలేదని.
నేనంటే నాకిష్టం పియురాలివి కాకున్నా ఇల్లాలినిచేసానని.
చివరికి నువ్వంటే నాకిష్టం!
నీవల్లే నన్ను నేను ఇష్టపడుతున్నానని..."
"చెప్పరాదా? నీ గుండె బాధ,
నేనున్నది నీకోసమే కదా?
బయమేలా ఓ జవరాలా?
నీవులేని గుండెలోన సవ్వడేలా? ||చెప్పరాదా?||
నీకోసం వేచానే చిరుదీపంలా!
నిలువెల్లా కరిగానే మరి మైనంలా!
గాయంలోనూ ఆశను రేపే,
అందాల మరుమల్లికవే.
ఎండను సైతం మంచుగ మార్చే,
చల్లని చూపు నీదేలే చెలియా... ||చెప్పరాదా?||
నీనవ్వుని వరమల్లే నాకిస్తావా?
ప్రతినిత్యం పువ్వులతో పూజిస్తాను.
నీ వెచ్చని లయ ఊపిరులే వింటేనే,
నా మది జుమ్మని సవ్వడులు చేసేను.
దేనిని సైతం లెక్కచేయకని,
చెప్పే అందం నీదేలే సఖియా... ||చెప్పరాదా?|| "
Wednesday, August 3, 2011
"ఆవేదన నిండిన మనసున,
చిరునవ్వుల పువ్వులు విరియవు..
నా ఊహలు నన్నేవీడెను,
అవి మెల్లగ నిన్నెచేరెను...
ఏమాయ చేశావిలానా....ఆ.
నా గతిని మార్చేశావిలా........ ||ఆవేదన నిండిన||
వెన్నెలనే చూడగాఇలా,
నీ మోమె వెక్కిరించెను .
పువ్వుల తడి నన్ను తాకినా,
నీ తనువే గుర్తుకొచ్చెను.
ఏమాయ చేశావిలానా....ఆ.
నా గతిని మార్చేశావిలా........ ||ఆవేదన నిండిన||
నీవు లేని రోజు రేయిలా,
చీకటులే కమ్ముకున్నవి.
నీవు లేని చందమామిలా,
చిన్నబోయి తుర్రుమ్మన్నది.
ఏమాయ చేశావిలానా....ఆ.
నా గతిని మార్చేశావిలా........ ||ఆవేదన నిండిన||
Tuesday, August 2, 2011
"తొలిచూపులోనే నా మనసు నీవై,
పలికించినావే ప ద ని స ల రాగం.
తెల్లవారింది మొదలు చుక్కలు పొడిచేదాక,
అయ్యింది నిత్యం నీదే ధ్యానం.
మాటి మాటికి నీవు మాటలాడుతుంటావు,
కనులు తెరిచే సరికి కలవైపోతావు.
ఆకాశంలో తారలా!
అందమైన ప్రకృతిలా!
ఆరుబైట వెన్నెలలా!
అనంతసాగర కెరటంలా!
ఊహకందని రూపం నీది,
చెప్పనలవి కాని అందం నీది.
ఇలా....
ఎంత చెప్పినా తీరనిది ఈ నా మధురానుభూతి."
Sunday, July 31, 2011
"మాటలాడ నీవు లేక మనసంతా బరువైతే...,
మదిలోని భావాలను చాటుగానె వుంచుకుంటే,
చక్కని నీ చిరునగవు,
చెరగని ఆ చిరునవ్వు,
చెంతచేరి ఇంకా నను చదరుమదురు చేస్తుంటే...
ఏమని చెప్పను? ఎలా చెప్పను?
హృదయంలో అనునిత్యం వేచ్చని నీ పవనాలే,
తాడలేక నీకొసం పరితపించి పోతుంటే,
ఏమని చెప్పను? ఎలా చెప్పను?
మెరుపల్లే కనిపిస్తూ,ప్రతి క్షణం మురిపిస్తూ..
మువ్వవై నా మదిని తట్టి,మత్తువై నను నిద్రపుచ్చి,
నీవు చేసే ఇంద్రజాలాన్ని గూర్చి,
ఏమని చెప్పను? ఎలా చెప్పను?
ఇలా,
ప్రతిక్షణం ప్రతి నిముషం వెంటాడే భావనలే,
ఆ భావాలే ఆవిరై మేఘాలుగ మారిపోని,
నిను చేరిన వెనువెంటనే చినుకులుగా రాలిపోని,
ఆ..చినుకులలో ఇమిడివున్న భావాన్ని చదివి చూడు,
నీకోసం పరితపించు హృదయాన్ని తెరచిచూడు."
"మనసు లేని మనుషుల మధ్య,
మనలో తిరిగే మృగాల మధ్య,
నోరుండీ అది ఉపయొగించని,
భారతదేశపు సగటు మనిషిని.
వేలకోట్లు మరి హుండీ కేస్తూ,
ఆ చుట్టూనే కాలే కడుపుల,
ఆకలినెందుకు తీర్చలేవు?
అని అడగలేని ఒక నిర్భాగ్యుడిని,
నేను! భారతదేశపు సగటు మనిషిని.
మాతృదేశమని గొప్పలు చెబుతూ,
స్త్రీల బ్రతుకులతో ఆటలాడుతూ,
మంచిని మరిచి నీతిని చెరచే,
సంకర మృగాల అంతుచూడమని,
న్యాయదేవతకు గంతలు విప్పే,
దైర్యం లేని దౌర్భాగ్యుడిని.
నేను! భారతదేశపు సగటు మనిషిని,
నూటికి నూరుశాతం భారతీయుడిని,
ఎండమావిలో ఎండుటాకుని! ."
మనలో తిరిగే మృగాల మధ్య,
నోరుండీ అది ఉపయొగించని,
భారతదేశపు సగటు మనిషిని.
వేలకోట్లు మరి హుండీ కేస్తూ,
ఆ చుట్టూనే కాలే కడుపుల,
ఆకలినెందుకు తీర్చలేవు?
అని అడగలేని ఒక నిర్భాగ్యుడిని,
నేను! భారతదేశపు సగటు మనిషిని.
మాతృదేశమని గొప్పలు చెబుతూ,
స్త్రీల బ్రతుకులతో ఆటలాడుతూ,
మంచిని మరిచి నీతిని చెరచే,
సంకర మృగాల అంతుచూడమని,
న్యాయదేవతకు గంతలు విప్పే,
దైర్యం లేని దౌర్భాగ్యుడిని.
నేను! భారతదేశపు సగటు మనిషిని,
నూటికి నూరుశాతం భారతీయుడిని,
ఎండమావిలో ఎండుటాకుని! ."
Saturday, July 30, 2011
అంతులేని అడవి వుంది,
అందులోనె కాకి కూడా వుంది.
కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది.
అంతులేని అడవి వుంది,
అందులోనె కాకి కూడా వుంది.
ఒక ఊరిలో కాలేజి పైనా వుండేది,
తెలివైన పోకిరి కాకి...
ఆ కాలేజి మహత్యమేమో కాని!
తెలివినంతా వంట పటించుకుంది....అరె
జీవితం ఎంత చిత్రమైనది..
ఎక్కడొ వున్న అందాల కాకి,
చదువుకుందామని కాలేజికి చేరింది..
కాలేజి పైన పోకిరిని చూసి,
"తొలిచూపులోనే నామనసు నీవై,
పలికించినావు పదనిసల రాగం"..
అంటూ పోకిరి కాకితొ ప్రేమలో పడింది.
చూపులకైతే అది పోకిరే కాని,
అందాల కాకిని పువ్వల్లే చూసింది.
అంతులేని ప్రేమని బహుమతి గా ఇచ్చింది.
ఆ ప్రేమ చూసి అందాల కాకి,
పోకిరి గుండెల్లో గువ్వల్లే ఒదిగింది...
రోజులు క్షణాలమల్లే ఇట్టే గడచి,
తీపి కబురును త్వరగానే తెచ్చింది.
కాలం ఆగక పరుగులు తీసి....
ఆ శుభగడియ రానే వచ్చింది.
కీక్... కీక్.. మంటూ..
లోకాన్ని చూస్తూ,
3 బుజ్జి పిట్టలు కళ్ళను తెరిచాయి.
చూస్తుండగానే వారం గడిచింది,
2 కాకులు కావ్.. కావ్వ్.. మంటూ,
అమ్మా , నాన్నలను ముద్దుగ పిలిచాయి,
గూటిలో మిగిలిన ఒక చిట్టి గువ్వ...
కుహు.......... కుహు.....
మంటు కూని రాగాతీసింది.
పక్కనున్న నా కల్లను కప్పి,
ఎవడితో యీ పాడుపని చెసావు?
పాటలు నేర్చుకొనమని నిన్ను పంపితె,
పాడు పని చేసి పాపాన్ని మోసావు!
నిను ప్రేమించిన గుండెల్లో గునపాన్ని దింపావు.
అనుకుంటూ ఈ అఙ్ఞాన కాకి,
ఏడ్చుకుంటు అడవిని దాటేసి వెళ్ళింది.
ఎక్కడ? తప్పు జరిగిందో తెలియని,
అందాల కాకి బావురుమంది..
తన ప్రాణంసగము వెళ్ళిపొయిందన్న నిజము
తెలిసి చిట్టిగుండె బదలైపోయింది..
బ ద లై పో యిం ది.
అంతులేని అడవి వుంది,
అందులోనె కాకి కూడా వుంది.
కాకంటె కాకి కానే కాదు!వన్నె చిన్నెల అందాల రాశి అది."
Friday, July 29, 2011
"మాటల కందని భావనలేవో......
కలలై కలవర పెడుతుంటే.
నిద్దుర వీడిన కనులలో నీవు....
వెన్నెలవై కొలువునావు.
ఆ వెన్నెల కాంతుల తీయని ఊహలు,
మనసున చేసెను సవ్వడులు.
ఎదసడి చప్పుడు తెలిసేలాగ,
నా ఊపిరిలో కొలువైనావు.
నీవేనా ఆశల కెరటం..
నీవేనా సుందర స్వప్నం...
నీకై వేచే నా మనసుని సరిగా ఏనాడైనా చూశావా?
నీ చిరునవ్వుల సవ్వడులకు లొంగిన పరవశాన్ని గమనించావా?
మాటల కందని భావనలేవో......
కలలై కలవర పెడుతుంటే.
నిద్దుర వీడిన కనులలో నీవు....
వెన్నెలవై కొలువునావు."
Thursday, July 28, 2011

"ఇది నిజమా! కలవరమా!,
ఇది నిజమా! కలవరమా!...... ||2||
నీ కనుల మెరుపే ఇలా నా......,
మౌనాన్ని మరిపించినాది.
ఓ చిలిపి ఊహే నువై నా.....,
నీడల్లే నా వెంట వుంది.
నువ్వు నా వెంట రావా!
గుండె నాదాన్ని వినవా!
చెలియా! చిలిపిగా చూడకే......... || ఇది నిజమా! ||
పువ్వులాంటి నీ నవ్వు చూడనా!
వెన్నెలల్లే నీ చెంత చేరనా!
చంపెయకే నీ నవ్వు తోటి.......
గాలితెమ్మరల్లే నన్ను తాకవే!
ఊహ వీడి నిజమల్లె మారవే!
ఊరించకే ఊహల్ని రేపి.........
నువ్వు సంద్యా సమీరం,
వేణుగానా వినోదం.
చెలియా చకచక వెళ్ళకే...... || ఇది నిజమా!||
తుమ్మెదల్లె నీ పెదవి గిల్లనా!
గుండెలోన చేరి సేదతీరనా!
ఈ రోజుకై ఇన్నాళ్ళు వేచా......
లాలిపాటలాగ జోలపాడనా!
నిన్ను చేరి నా మనసునడగనా!
నను వీడకే ఏ జన్మకైనా....
నువ్వు మాయా మయూరం,
కలల కావ్యా సరాగం.
వరమై నన్నిలా అల్లుకో.......
ఇది నిజమా! కలవరమా!,
ఇది నిజమా! కలవరమా!...... "
"విరజాజి పూల జడివాన నీవు...
మనసంతా కురిసే తొలిమంచు నీవు...
తనువనువు తడిమే చిరుగాలి నీవు...
కవి కలములోని ప్రతి పదము నీవు...
ఆశలు రేపే కోర్కెవు నీవు....
ఆయువు పెంచే జీవము నీవు...
నిజమనిపించే కొంటె కలవు నీవు...
కలకాలం నా నీడవై నను అనుసరించే నా తోడువు నీవు...
ఒక్క మాటలో చెప్పాలంటే అంతంలేని కవితవు నీవు......"
Subscribe to:
Posts (Atom)



























